Advertisementt

నాగ‌బాబు మ‌ళ్లీ వేసేశాడు.. అయితే...

Mon 31st Dec 2018 09:45 PM
bandla ganesh,naga babu,telangana elections,balakrishna,7 o`clock blde  నాగ‌బాబు మ‌ళ్లీ వేసేశాడు.. అయితే...
nagababu trolls bandla ganesh నాగ‌బాబు మ‌ళ్లీ వేసేశాడు.. అయితే...
Advertisement
Ads by CJ

ఈ మ‌ధ్య మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా దాన్ని ఆసాంతం వాడేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇటీవ‌ల హీరో నంద‌మూరి బాల‌కృష్ణను ఉద్దేశించి ఆయ‌న ఎవ‌ర‌ని అడిగిన ప్ర‌శ్న‌కు వ్యంగ్యాన్ని జోడించి పెద్ద ర‌చ్చ‌చేసిన నాగ‌బాబు ఆ త‌రువాత కూడా ఓ రేంజ్‌లో బాల‌య్య‌ను ఉడికించిన విష‌యం తెలిసిందే. బాల‌య్య అంటే ఎవ‌రిని, ఒక‌ప్ప‌టి సీనియ‌ర్ న‌టుడ‌ని, మంచి కామెడీ చేసేవాడ‌ని చ‌మ‌త్క‌రించాడు. ఆ బాల‌య్య కాద‌ని హీరో బాల‌య్య అని చెప్ప‌డ్డంతో ఇటీవ‌ల పెద్ద ర‌చ్చ‌గా మారి బాల‌య్య‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించిన విష‌యం తెలిసిందే.  

ఆ వివాదం ఇంకా స‌ద్దుమ‌న‌గ‌క ముందే ఈ సారి కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిపై పంచులేశారు. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో హంగామా సృష్టించిన బండ్ల గ‌ణేష్ మ‌హాకూట‌మి అధికారంలోకి రాకుంటే బ్లేడ్‌తో పీక కోసుకుంటాన‌ని శ‌ప‌థం చేసి న‌వ్వుల పాల‌య్యాడు. నాగ‌బాబు ఈ సారి ఈ టాపిక్‌ను వాడుకుని క‌మెడియ‌న్ బండ్ల గ‌ణేష్‌పై అదిరిపోయే పంచులేశారు. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చార వేళ ఓ ప‌క్క రేవంత్‌రెడ్డి, మ‌రో ప‌క్క తెరాస మ‌ధ్య‌ వాడీ వేడీ మాట‌ల యుద్ధం జ‌రుగుతూ వాతార‌ణాన్నిహీటెక్కిస్తుంటే మ‌ధ్య‌లో బండ్ల గ‌ణేష్ త‌న కామెడీతో రిలీఫ్ ఇచ్చే ప్ర‌యత్నం చేశాడ‌ని పంచ్ వేసేశాడు.

మ‌హాకూట‌మి రాక‌పోతే బ్లేడుతో పీక కోసుకుంటాన‌ని అన్న‌ప్పుడు అత‌నికి అంత సీను లేద‌ని ముందే గ్ర‌హించాన‌ని, నిజ‌జీవితంలో త‌న చేష్ట‌ల‌తో హిలేరియ‌స్‌గా న‌వ్విస్తున్న బండ్ల గ‌ణేష్ ఇదే ప‌ని సినిమాల్లో చేసుంటే స్టార్ క‌మెడియ‌న్ అయ్యుండేవాడ‌ని, ఇప్ప‌టికైనా మించిపోయింది ఏమీ లేద‌ని, మ‌ళ్లీ వెండితెర‌పై ఇదే కామెడీని కంటిన్యూ చేస్తే  అత‌నికి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని స‌ల‌హా కూడా ఇచ్చాడు. బండ్ల కామెడీ పేర‌డీలు అయిపోయి చాలా రోజులే అవుతున్నా నాగ‌బాబు మ‌ళ్లీ దాన్ని తెర‌పైకి తీసుకొచ్చి ఇలా కామెడీ చేయ‌డం నాగ‌బాబు కొత్త స్ట్రాట‌జీకి అద్దంప‌డుతోంద‌ని, రానున్న రోజుల్లో ఆయ‌న ఇంకెంద‌రిమీద ఇలాంటి పంచులేస్తాడో అని చాలా మంది సినీ జ‌నాలు ఆరా తీస్తున్నార‌ట‌. 

nagababu trolls bandla ganesh:

nagababu trolls bandla ganesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ